ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందిచాడమే ధ్యేయం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందిచడమే ధ్యేయం
మణుగూరు, శోధన న్యూస్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందిచడమే ధ్యేయం గా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రాధమికొన్నత పాఠశాల కూనవరం లొ ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ అధ్యక్షతన బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలను సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరై తొలుత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల పాఠశాలలో ఏర్పాటుచేసిన విద్యుద్దీకరణ, త్రాగునీరు , మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలను, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఈ వేసవిలో ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, మైనర్ రేపైర్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మరియు నాణ్యమైన విద్య ను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. బడి బాటలో ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇప్పటివరకు 18 మంది విద్యార్థుల్ని పాఠశాలలో చేర్పించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని, టీచర్స్ ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నారని, కావున తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇంకా పాఠశాలలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానన్నారు. తొలి అడ్మిషన్ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందించారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఏనిక ప్రమీల, కూనవరం గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ, వీరస్వామి, ఎంపీడీవో శ్రీనివాస రావు, ఎం పి ఓ వెంకటేశ్వర్లు , అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అహ్మదుల్లా, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం జి నాగశ్రీ, మండల నోడల్ ఆఫీసర్ స్వర్ణ జ్యోతి, జిల్లా ఎంపీటీసీల అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు, కూనవరం ఎంపీటీసీ తాటి సరిత, విలేజ్ సెక్రటరీ సంధ్యారాణి, ఏ ఈ సక్రు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ టీచర్స్, సారయ్య, రఘు మోహన్ రావు, సింగ రవిబాబు, జయలక్ష్మి, బిఈ రు, యూనిఫాం స్టిచ్చింగ్ టైలర్స్, గ్రామస్తులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.