మీడియా సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్
మీడియా సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్
మహబూబాబాద్, శోధన న్యూస్: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం, గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 31లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మొదటి అంతస్తు లో ఉన్న కంట్రోల్ రూమ్ లను శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సమాచారం అందించడం కోసం, వివిధ రాజకీయ పార్టీల ప్రచార అనుమతుల నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ, మీడియా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికలు సజావుగా సాగడంలో మీడియా కీలకపాత్ర వహించాల్సి ఉంటుందని, అందుకు ప్రతి ఒక్క పాత్రికేయులు సహకరించాలని కోరారు.