నీటి ఎద్దటి నివారించడానికి ఫామ్ పౌండ్ నిర్మాణం ఎంతో ముఖ్యం
నీటి ఎద్దటి నివారించడానికి ఫామ్ పౌండ్ నిర్మాణం ఎంతో ముఖ్యం
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
చండ్రుగొండ, మే శోధన న్యూస్ :
నీటి ఎద్దటి నివారించడానికి ఫామ్ పౌండ్ నిర్మాణం ఎంతో ముఖ్యం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండుగొండ మండలంలో మంగయ్య బంజర, పోకల గూడెం మరియు రావికంపాడు గ్రామంలో గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విస్తృతంగా పర్యటించి, గ్రామాల్లో చేపడుతున్న ఇంకుడు గుంతల నిర్మాణం, ఫారం పౌండ్స్, కమ్యూనిటీ పశుశాల నిర్మాణ పనులను పరిశీలించారు. చండ్రుగొండ మండలంలో పర్యటనలో భాగంగా ముందుగా కలెక్టర్ మంగయ్య బంజర గ్రామపంచాయతీ పరిధిలోని మాలోతు పకీరీ వ్యవసాయ క్షేత్రంలో నిర్మిస్తున్న పారం పౌండ్ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంపొందించడానికి, భవిష్యత్ తరాలకు నీటి ఎద్దటి నివారించడానికి ఫామ్ పౌండ్ నిర్మాణం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ ఫామ్ పౌండ్ నిర్మాణం ద్వారా భూగర్భ జలాల అభివృద్ధి చెందటంతో పాటు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో కొంతమంది రైతులు ఫామ్ పౌండ్ లలో చేపల పెంపకం లో విజయం సాధించారని, అందరూ వారిని ఆదర్శంగా తీసుకొని లాభాలు గడించాలన్నారు. అనంతరం తోకల గూడెం గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీల ద్వారా నిర్మిస్తున్న పొలం బాటను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కూలీలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలకు అవసరమైన పలుగులు, పారలు అందజేస్తామన్నారు. కూలీలతో ముచ్చటిస్తూ వారితో పాటుగా పలుగు, పార చేతబట్టి కలెక్టర్ పని చేశారు. పోకల గూడెం పంచాయతీ పరిధిలో లో నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను పరిశీలించారు. రావికంపాడు గ్రామపంచాయతీ నందు నిర్మిస్తున్న కమ్యూనిటీ పశుశాల పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్టు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అదే గ్రామంలో పలువురు రైతులు సాగు చేస్తున్న మునగ సాగును పరిశీలించి, రైతులకు అంతర్ పంటలు వేయడం ద్వారా రైతులు ఏ విధంగా ఆర్థిక అభివృద్ధి చెందవచ్చు వివరించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఎంపీడీవో అశోక్, ఏవో నవీన్, ఎంపీ ఓ ఖాన్, ఏపీవో శ్రీను మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.