పర్యావరణ పరి రక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలి
పర్యావరణ పరి రక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలి
-పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, శోధన న్యూస్ : పర్యావరణ పరి రక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం జడ్పీ స్కూల్ ఆవరణలో సింగరేణి రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు,. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ప్రతి ఒక్కరు పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. విద్యార్థుల్లో కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆయన తెలిపారు. జడ్పీ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పట్టుదలతో కార్యక్రమం చేపట్టిన సామాజిక కార్యకర్త మంగీలాల్ నేతృత్వంలో రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న సింగరేణి మణుగూరు ఏరియా యాజమాన్యానికి, జడ్పీ స్కూల్ ఉపాధ్యాయులను సిబ్బందిని విద్యార్థులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో మణుగూరు తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎండిఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, ఎంపీఓ పి వెంకటేశ్వరరావు, జెడ్పి కో ఎడ్యుకేషన్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జి నాగశ్రీ, ఉపాధ్యాయులు బి కిషన్, కే రవికుమార్, కే పరమయ్య, బి శ్రీనివాసరావు, కే నాగేశ్వరరావు, సిహెచ్ సరిత, ఏ శేఖర్, వి కృష్ణమూర్తి, బి నరేష్, పి కోటేశ్వరరావు, సింగరేణి సివిల్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు, యు శివరామకృష్ణ, కే గురుమూర్తి, జి నాగేశ్వరరావు, ఐ గోపి, కే నాగేశ్వరరావు, జి మధు బాబు, తదితరులు పాల్గొన్నారు.