ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
- ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ : ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ వద్ద ఆదివాసీ జెండా ఎగరవేసి, కొమరం భీం విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1994 ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసి దినోత్సవం గా ప్రకటించడం జరిగింది అని అన్నారు. కొమరం భీమ్ ఆదివాసుల కొరకు చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇటీవల మంత్రి సీతక్క, ఆదివాసి ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు. అనంతరం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందా సంతోష్, కొర్సా ఆనంద్, కొర్సొ బాలకృష్ణ,ఆదివాసీ ఐక్యవేదిక నాయకులు తోలేం శ్రీను, గొగ్గల కృష్ణ, ఇర్పా రామనాథం, మడకం సత్యం లింగం, గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గల ఆర్.కే దొర, మండల అధ్యక్షులు కొమరం శ్రీను, ప్రధాన కార్యదర్శి కుర్సం సారయ్య, జేఎసి కన్వీనర్ సోలం అశోక్, కొమరం నాగేంద్రబాబు,కుంజ కృష్ణ, జేఏసీ లీగల్ అడ్వైజర్ దినసరి నర్సింహా మూర్తి, మీడియా సలహాదారులు సనప భరత్, పాయం హనుమంతు, ఆదివాసీ ఉద్యోగ సంఘాల నాయకులు పోలే బోయిన సాంబ, కొమరం అరున్ బాబు, ముఖేష్,పూనెం రాములమ్మ, ప్రజా గాయకుడు సిద్దెల హుస్సేన్, సోలం వినయ్ కుమార్, బొగ్గం రమేష్, కోరం శేఖర్,మాజీ సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, తోలెం కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.