తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మావోయిస్టు ప్రభావిత ప్రాంత ఆదీవాసి ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

మావోయిస్టు ప్రభావిత ప్రాంత ఆదీవాసి ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదీవాసి ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  చెన్నాపురం,ఎర్రంపాడు, బత్తినపల్లి, బట్టిగూడెం గ్రామాల ఆదీవాసి ప్రజలకు పోలీసుల అద్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన చెన్నాపురం, ఎర్రంపాడు, బత్తినపల్లి, బట్టిగూడెంలోని ఆదీవాసి ప్రజలకు చర్ల పోలీసుల ఆధ్వర్యంలో   ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్రంపాడు, బత్తినపల్లి,బట్టిగూడెం గ్రామస్తులకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి వారిని చెన్నాపురం గ్రామానికి తరలించడం జరిగింది. చెన్నాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రారంభించారు.సుమారుగా 150 కుటుంబాలకు నిపుణులైన వైద్యులచే వైద్య చికిత్సలు నిర్వహించి,మందులు పంపిణీ చేశారు.అనంతరం అక్కడ ఉన్న చిన్న పిల్లలకు దుస్తులు,బిస్కెట్ ప్యాకెట్లు,బ్రెడ్ ప్యాకెట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని తెలిపారు.

ఇందులో భాగంగానే   తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలోని ఆదీవాసి ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వర్షాకాలం కారణంగా వర్షపు నీరు నిల్వ ఉండడం వలన దోమలు అధికమై మలేరియా,డెంగ్యూ లాంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.అనంతరం చెన్నాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో ఎస్పీ ముచ్చటించారు.నిషేధిత సిపిఐ మావోయిస్టులు తమ మనుగడ కోసం ఆదివాసి ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.

అతి త్వరలోనే చెన్నాపురం,పూసుగుప్ప గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు సహకరించవద్దని,మావోయిస్టుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ మెడికల్ క్యాంపునకు సహకరించిన వైద్య బృందానికి మరియు చర్ల పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా ఎస్పీ గారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్ ఐపిఎస్,చర్ల సీఐ రాజువర్మ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సైలు నర్సిరెడ్డి,పీవిఎన్ రావు మరియు చర్ల సిహెచ్ సి వైద్యులు సాయి వర్ధన్,పెడియాట్రిక్ వైద్యులు విజయా రావు,జనరల్ ఫిజీషియన్స్ డాక్టర్స్ లోకేష్,దివ్య గైనకాలజీ వైద్యురాలు శ్రీకాంతి మరియు తదితరులు పాల్గొన్నారు.

-పూసుగుప్ప ఉంజుపల్లి  సిఆర్సి  క్యాంపులను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు –

తెలంగాణ ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలైన ఉంజుపల్లి మరియు పూసగుప్ప లోని సిఆర్పిఎఫ్ క్యాంపులను ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సందర్శించారు.అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.నిషేధిత సిపిఐ మావోయిస్టుల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అవసరమతంగా ఉండాలని సూచించారు.ఈ రెండు క్యాంపులలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని నిర్మాణ పనులను పరిశీలించారు.అనంతరం అక్కడ అధికారులు మరియు సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *