కరకగూడెంలో నెలకొన్న ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలి
కరకగూడెంలో నెలకొన్న ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలి
కరకగూడెం శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో నెలకొన్న ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలని సిపిఎం, టిడిపి పార్టీల ఆధ్వర్యంలో తహసిల్దార్ నాగ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు కొమరం కాంతారావు, సిరిశెట్టి కమలాకర్ లు మాట్లాడుతూ మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవటంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక ఈనాటికీ సగం మంది కూడా ఆధార్ అప్డేట్ చేయించుకోలేదని తక్షణమే ఆధార్ సెంటర్ మంజూరి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలో అనేక గ్రామాలు వేసవికాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని మిషన్ భగీరథ పనులు కూడా చాలా కాలనీల్లో అసంపూర్ణంగానే ఉన్నాయని తక్షణమే తాగునీటి ఎద్దడిని నివారించేలా చర్యలు తీసుకోవాలని మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మించేందుకు తగిన కృషి చేయగలరని పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో విద్య, వైద్య రంగంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి ప్రజలకు అందుబాటులోకి అన్ని వస్తువులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలో నెలకొన్న ప్రధానమైన సమస్యలను తమరి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగలరని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు చెర్పసత్యం పాల్గొన్నారు.