తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

 సత్ఫలితాలు ఇస్తున్న ఆపరేషన్ చేయూత

 సత్ఫలితాలు ఇస్తున్న ఆపరేషన్ చేయూత

-నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా  కమిటీ సభ్యుల లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ఆపరేషన్ చేయూత  సత్ఫలితాలను ఇస్తోందని భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ తెలిపారు. ఇటీవల ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కిష్టారం పీస్ ఎస్ పరిధిలోని తెలంగాణ- ఛత్తీస్గడ్ సరిహద్దు గ్రామాలైన డోకుపాడు మరియు పుట్టపాడు గ్రామాల నుండి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో మిలీషియా డెప్యూటీ కమాండర్ మరియు కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా,  కమిటీ సభ్యులలో డోకుపాడుకు చెందిన రవ్వ సన్న,   ముసికి సన్న,  మడకం జోగా, కోవాసి మంగ,  రవ్వ లక్క, పుట్టపాడుకు చెందిన  మిలీషియా డెప్యూటీ కమాండర్ కర్ణం పొజ్జాలు ఉన్నారన్నారు. పోలీస్ అధికారుల సమక్షంలో లొంగిపోయిన పై ఆరుగురు గత కొన్ని సంవత్సరాలుగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా, కమిటీ సభ్యులుగా పని చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన చర్ల ఏరియా కమిటీ మరియు చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన కిష్టారం ఏరియా కమిటీ సాయుధ దళసభ్యులతో కలిసి తెలంగాణ- చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలో పలు విధ్వంసకర సంఘటనలు, పోలీసులను హత మార్చడానికి ఐఈడి బాంబ్ లు అమర్చిన పలు సంఘటనలలో పాల్గొన్నారు. కాలానుగుణంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల విముఖత ఏర్పడి, తెలంగాణ-ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని గుర్తిస్తూ,తమ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం గ్రామస్తులతో చర్చించి, నిర్ణయం తీసుకొని పోలీస్ అధికారులు ఎదుట లొంగిపోవడం జరిగింది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత” కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ తెలంగాణ ఛత్తీస్గడ్ సరిహద్దు గ్రామాలలో పర్యటిస్తూ నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ద్వారా ఆకర్షితులై ఈ ఆరుగురు లొంగిపోవడం జరిగింది. త కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఆదివాసి ప్రజలలో ఆదరణ, నమ్మకం కోల్పోయి ఛత్తీస్గడ్ రాష్ట్రంలో అడవి ప్రాంతానికి మాత్రమే పరిమితమై, కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటుగా కమిటీలను ఏర్పాటు చేసి బలవంతపు వసూలే లక్ష్యంగా పనిచేస్తూ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే రోడ్లను ధ్వంసం చేయడం, సెల్ఫోన్ టవర్లను కాల్చి వేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయక ఆదివాసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ ఆదివాసి ప్రజల అభివృద్ధికి ఆటంకంగా మారిన నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యులపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు గాని, మిలీషియా సభ్యులకు గానీ భద్రాచలం పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు స్వయంగా గాని లేదా కుటుంబ సభ్యుల ద్వారా గాని మీకు సమీప పోలీస్ స్టేషన్ అధికారులను గానీ లేదా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను గాని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.  లొంగిపోయే దళ సభ్యులకు మిలీషియా సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి భద్రాచలం పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో   141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ కమాండెంట్  రితేష్ ఠాకూర్,  సెకండ్ ఇన్ కమాండెంట్ కమల్ వీర్ యాదవ్, అసిస్టంట్ కమాండెంట్  రేవతి ఆర్జునన్ , దుమ్ముగూడెం సీఐ బి అశోక్,  చర్ల సిఐ  ఎ  రాజు వర్మ, దుమ్ముగూడెం ఎస్సై  పి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *