కరకగూడెంతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన ప్యానల్ టీం…

ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన ప్యానల్ టీం…

-బోధన అధ్యాయం రికార్డులు పరిశీలన….

కరకగూడెం,శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల ఆశ్రమ పాఠశాలను గిరిజనాభివృద్ధి సంస్థ ప్యానెల్ టీంను ప్రధానోపాధ్యాయుడు జగన్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఏడుగురు సభ్యులు కలిగిన టీం ఆశ్రమ పాఠశాలలోని ప్రతి తరగతి ఉపాధ్యాయుల పనితీరును వారు రికార్డులను వ్యక్తిగత అధికారులను పరిశీలించారు. తెలుగు, ఆంగ్లము, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రము, గణితశాస్త్రం, హిందీ, సంబంధిత అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించి .వారి వ్యక్తిగత రికార్డులను పరిశీలించారు, సైన్స్ ల్యాబ్ ను పరిశీలించి సైన్స్ ల్యాబ్ లో ఉన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో వారికి అందించే విద్య తదితరు అంశాలపై విద్యార్థులతో మాట్లాడి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. విద్యార్థులకు సులభతరమైన విద్యను అందించే లక్ష్యంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ముందుకు వెళ్లాలని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *