ప్రజాదీవెన సభను జయప్రదం చేయాలి
ప్రజాదీవెన సభను జయప్రదం చేయాలి
-పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, శోధన న్యూస్ : ఈ నెల 11వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో జరిగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదీవెన సభను విజయవంతం చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. మండలంలోని గుట్టమల్లారం హనుమాన్ ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మహలక్ష్మీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, గృహజ్యోతి క్రింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 11న జరిగే ప్రజాదీవెన సభలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సైతం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్రెడ్డి భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లో పర్యటించనున్నారన్నారు. రానున్నారన్నారు. మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కళాశాల మైదానంలో 11న జరిగే ప్రజాదీవెన సభకు భారీగా జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో, సిపిఐ పార్టీ కార్యాలయంలో మిత్రపక్షాల నాయకులతో సమావేశమై సీఎం రేవంత్రెడ్డి సభకు ప్రజలను అధిక సంఖ్యలో తరలించి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య, ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ చందా సంతోష్కుమార్. నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, వైస్ఎంపిపి కరివేద వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుచ్చకాయల శంకర్, దొబ్బల వెంకటప్పయ్య, ఎంపిటిసి గుడిపూడి కోటేశ్వరరావు, సర్వేశ్వరరావు,తరుణ్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.