అసాంఘీక కార్యకలాపాల నియంత్రణ,శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసుల పనితీరు భేష్
అసాంఘీక కార్యకలాపాల నియంత్రణ,శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసుల పనితీరు భేష్
-జిల్లాలో ఏడాది కాలంలో 326 మంది మావోయిస్టుల లొంగుబాటు.
-సుమారుగా 30 కోట్ల రూపాయల గంజాయి స్వాదీనం
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
-జిల్లా పోలీసుల వార్షిక నివేదిక-2025 ను విడుదల
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 27- శోధన న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో పోలీసు అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయడంలో,శాంతిభద్రతల పరిరక్షణలో ముందంజలో ఉన్నారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు వార్షిక నివేదిక-2025 సమావేశాన్ని ఏర్పాటు చేసారు.ముందుగా వార్షిక నివేదిక బుక్ లెట్ ను విడుదల చేశారు.అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాంతి భద్రతలకు సంబంధించి నివేదికలోని వివరాలను వెల్లడిస్తూ గత ఏడాదితో పోలిస్తే 9.65 శాతం నేరాల శాతం పెరిగిందని గత ఏడాది 5636 కేసులు నమోదు కాగా,ప్రస్తుత సంవత్సరం 2025లో 6180 కేసులు నమోదు కావడం జరిగిందని,దారి దోపిడీ 01, దోపిడిలు 05 కేసులు,దొంగతనాలు 307 కేసులు నమోదు కాబడ్డాయి.హత్యలు 23,మానభంగాలకు సంబంధించి ఏడాదిలో 83 కేసులు నమోదు కాబడ్డాయని వీటితో పాటు వరకట్న మరణాలు,డొమెస్టిక్ నేరాలు తగ్గు ముఖం పట్టగా,గత సంవత్సరం SC/ST కేసులు 102 నమోదు కాగా,ఈ ఏడాది 122 నమోదయ్యాయని,పోక్సో కేసులు గత ఏడాదిలో 105 కేసులు నమోదు కాగా,ఈ ఏడాది 128 కేసులు నమోదు కాబడ్డాయని ఎస్పీ తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే 420 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం కేవలం 384 కేసులు మాత్రమే నమోదు కావడం జరిగింది. దీనితో మొత్తం మీద 8.57 శాతం మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. జిల్లా పరిధిలో ఈ ఏడాదిలో 70 కేసుల్లో మొత్తం 221మందిని అరెస్టు చేయడంతో పాటు వీరిని నుండి కోట్ల విలువగల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోగా,ఇందులో 5707 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, సుమారుగా 22 కోట్ల రూపాయల గంజాయిని ఈ ఏడాది తగులబెట్టడం జరిగిందని తెలిపారు. చోరీలకు సంబంధించి ఏడాది మొత్తం 307 కేసులలో 3,75,10,691/- రూపాయల సొత్తును కోల్పోగా,141 కేసులలోని 1,21,99,297/- రూపాయల సొత్తును రికవరీ చేయడంలో జిల్లా సీసియస్ పోలీసుల పాత్ర కీలకమన్నారు. లోక్ అదాలత్లో ఈ ఏడాది మొత్తం వివిద రకాల 20,595 కేసులు పరిష్కృతమయ్యాయని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 15,347 కేసులు నమోదు.సైబర్ సైబర్ క్రైమ్ సంబంధించి 196 కేసులు నమోదు చేయబడ్డాయని ఎస్పీ తెలిపారు.
జిల్లా పరిధిలో మొత్తం 1824 కేసులు పరిష్కారం కాగా ఇందులో 07 గురికి జీవిత ఖైదు,ఇద్దరికి 20 సంవత్సరాల జైలు శిక్ష,05 గురికి 10 సంవత్సరాలు,ముగ్గురికి 07 సంవత్సరాల శిక్షలు ఖరారు కాబడ్డాయి. రాబోయే నూతన సంవత్సరంలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని,శాంతి భద్రతల పరిరక్షణే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు.ముఖ్యంగా చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాలు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాము.రోడ్డు ప్రమాదాల నివారించడం,స్థానికంగా గంజాయి సరఫరా,అక్రమంగా రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమములో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,ఇల్లందు డిఎస్పి చంద్ర భాను,కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,డీసిఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


