ఓటు హక్కు భారం కాదు.. బాధ్యత
ఓటు హక్కు భారం కాదు.. బాధ్యత
-జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు బాధ్యతగా వినియోగించుకోవాలని, ఓటు హక్కు భారం కాదు.. బాధ్యత అని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధమని చెప్పారు. సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకునే అకాశం ఓటు హక్కు ద్వారా మాత్రమే ఉంటుందని తెలిపారు. జిల్లాలో 100% ఓటింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, నీడ, ఫ్యాన్‌లు తదితర సౌకర్యాలు అన్ని కల్పించామని తెలిపారు. జిల్లాలో రేపు ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు.