ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో 5 కే రన్ నిర్వహించారు. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి జండా ఊపి 5కే రన్ ప్రారంభించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ మీదుగా మార్కెట్ యార్డ్ వరకు ఈ 5కే రన్ సాగింది.వివిధ శాఖల అధికారులతో పాటు యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున 5కె రన్ లో భాగస్వాములయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని ప్రతీ పౌరునికి సమాన విలువ కలిగిన ఓటు హక్కును రాజ్యాంగం మనకు కల్పిం చిందని, ఎన్నికల్లో వయస్సు అర్హత, ఓటరు జాబి తాలో పేరు గల ప్రతీ ఒక్కరు ఓటు హక్కును విని యోగించుకోవాలన్నారు. పోలింగ్ శాతం పెంచేం దుకు కళాజాత, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అర్హులైన వారందరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అన్నారు.ఎన్నికల నేపథ్యంలో స్వీప్‌లో భాగంగా వాక్ టూ పోలింగ్ బూత్, ఓటు వినియోగం, ప్రాముఖ్యత తెలియజేసేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 2024, ఏప్రిల్ 1 వరకు 18 ఏళ్లు నిండిన వారంతా ఏప్రిల్ 15లోగా తమ వివరాలను నమోదు చేసుకొని నూతన ఓటరు కార్డు పొందాలని కోరారు. జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్లు ఓటు వేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. అనంతరం అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.