హైలెవల్ వంతెన ప్రారంభం
హైలెవల్ వంతెన ప్రారంభం
భద్రాచలం, శోధన న్యూస్: భద్రాచలం వద్ద హై లెవల్ వంతెన ప్రారంభించుకోవడం చాలా సంతోషమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అన్నారు. భద్రాచలం వద్ద 98.45 కోట్లతో గోదావరిపై నిర్మించిన రెండో వంతెనను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2.3 కిమి పొడవు కాగా ఇందులో 1.25 కిమి పొడవు వంతెన, మిగిలినది అప్రోచ్ రహదారి ఉన్నట్లు తెలిపారు. 7.5 మీటర్లు వెడల్పు తో ఈ వంతెన నిర్మాణం జరిగినట్లు తెలిపారు. మొత్తం 37 స్లాబులతో వంతెన పూర్తి అయినట్లు తెలిపారు. శ్రీరామనవమికి భద్రాచలం విచ్చేయు భక్తులుకు అదనపు వంతెన అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందని వంతెన పూర్తి తో రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లు తెలిపారు. విజయవాడ నుండి జగదల్పూర్ వరకు ఉన్న రహదారిలో 166వ కిమి వద్ద ఈ వంతెన నిర్మాణం జరిగినట్లు తెలిపారు. 2014 సంవత్సరంలో ఈ వంతెన పనులు ప్రారంభం అయ్యాయని నేడు విజయవంతంగా పనులు ప్రారంభించుకున్నామని అన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో శ్రీరామనవని, మహా పట్టాభిషేకం మహోత్సవాలకు భద్రాచలం విచ్చేయు భక్తులకు ఒకటే వంతెన ఉండటం వల్ల ప్రయాణికులు, భక్తులలకు ట్రాఫిక్ ఇబ్బందులు నుండి విముక్తి లభించిందన్నారు. పెండింగ్ ఉన్న పనులను కూడా సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.