ఇచ్చిన హామీలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్
ఇచ్చిన హామీలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది
– రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసిఆర్ ప్రభుత్వం
-మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్
మణుగూరు, శోధన న్యూస్ : ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలన్నింటిని రాష్ట్ర కాంగ్రెస్ ప్రబుత్వం ఖచ్చితంగా
అమలు చేసి తీరుతుందని మాజీ కేంద్ర మంత్రి,మాజీ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాట్లాడారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన లో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని అన్నారు.గత ప్రభుత్వం ఇచ్చిన ఏ వాగ్దానాలను అమలు చేయలేదన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మో హన్ సింగ్ ప్రధాన మంత్రి ఉన్నప్పుడే జాతీయ రహదారుల కోసం నిధులను మంజూరు చేశామని తెలిపారు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు ఇచ్చిన ఆరు గ్యారెంటిలు అమలులో భాగంగానే మహిళలకు ఉచిత ప్రయాణం,ఆరోగ్య శ్రీ లను అమలు చేయడం జరుగుతుందన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ను అప్పుల కుప్పగా మార్చారని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 5వ తేది లోపు వేతనాలను అందిస్తామని అన్నారు.బిజెపి కేంద్ర ప్రభుత్వం హయాంలో అధాని అంబానీ వంటి బడా కాంట్రా క్టర్లకు పనులు అప్పగించారని ఆరోపించారు.ఆ నాడు బలరాం నాయక్ గారు ఎంపిగా కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు కేంద్రీయ విద్యాలయాలు,మోడల్ స్కూల్,ట్రైన్ సౌకర్యం, హైవే నేషనల్ రోడ్స్,ఆసుపత్రి వంటి వాటిని ముందు చూపుతో అభివృద్ధి చేశానని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ ద్వారా సామాన్యులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు.కేంద్ర బిజెపి ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు,రేట్లు విపరీతంగా పెరిగి పోయాయని అన్నారు.రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను వంద శాతం పరిష్కరిస్తామని అన్నారు.మహబూబాబాద్ పార్లమెంట్ (ఎంపి) టికెట్ తనకు కేటాయించేందుకు సిఎం సుముఖంగా ఉన్నారని త్వరలో ప్రకటిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవ్ రెడ్డి,అవుల సర్వేశ్వరరావు,బానోత్ లక్ష్మణ్, ఎన్ ఎస్ యుఐ రాష్ట్ర కార్యదర్శి మహబూబాబాద్ ఎన్ ఎస్ యుఐ ఇంఛార్జి షేక్ అరిఫ్ పాషా, సామ శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్, శ్రీను లక్ష్మణ, రవి,జాన్,శ్రీను, రామ్ రెడ్డి, పొడుతురి ఈశ్వర్, నందు, జిలకర నరేష్, నామ రాణి, ఆసిఫ్ పాషా, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.