వాసవి క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలి
వాసవి క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలి
– వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ దోసపాటి వెంకటేశ్వరరావు
మణుగూరు, శోధన న్యూస్ : వాసవీక్లబ్, వాసవీ వనితా వైభవం సేవలను మరింత విస్తృతం చేయాలని వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ దోసపాటి వెంకటేశ్వరరావు, ఐపీసీ లు వనమా రామకృష్ణ, బండారు నరసింహా రావులు అన్నారు. ఆదివారం మణుగూరులో జరిగిన వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం ఎన్నికైన అనంతరం మణుగూరు, సారపాక క్లబ్బులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువవడంతో పాటు నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం హర్షించదగిన విషయమన్నారు. అదేవిధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు చిత్తలూరి ఉమ, మణుగూరు, సారపాక వాసవీక్లబ్ అధ్యక్షులు కేసా రాజేంద్ర ప్రసాద్, మనోజ్, రీజియన్ చైర్మన్ కడివెండి విశ్వనాధ గుప్తా, జోన్ చైర్మన్ శేషుబాబు, డిస్ట్రిక్ జాయింట్ సెక్రటరీ దింటకుర్తి బ్రహ్మయ్య,
ఆర్యవైశ్య నియోజకవర్గ ఇన్చార్జి కత్తిరాము, చిత్తలూరి రమేశ్, శ్యామ్, నాగరాజు, వసుంధర తదితరులు పాల్గొన్నారు.