ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రావొద్దు
ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రావొద్దు
ఖమ్మం, శోధన న్యూస్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. అదనపు కలెక్టర్, పెనుబల్లి మండలం గణేశునిపాడు, కల్లూరు మండలం చౌడారం గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్య కొనుగోలు కేంద్రాలను సందర్శించి, కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేశారు. ఎఫ్ఏక్యూ ప్రమాణాల మేరకు ధాన్యం కేంద్రాలకు తెచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ధాన్య కొనుగోలు కేంద్రాల వద్ద కనీస మౌళిక సదుపాయాల కల్పన చేయాలని, నీడ కొరకు షామియాన లు, త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ కల్లూరు మండలం పేరువంచ గ్రామం వద్ద ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని, ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చెక్ పోస్ట్ అధికారులకు అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు.