విద్యార్థులకు సకాలంలో స్కూల్ యూనిఫామ్ లు అందించాలి
విద్యార్థులకు సకాలంలో స్కూల్ యూనిఫామ్ లు అందించాలి
– జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : విద్యార్థులకు సకాలంలో స్కూల్ యూనిఫామ్ లు అందించాలని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సూచించారు. శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తులు పంపిణీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుట్టు పనిలో నైపుణ్యం కలిగిన స్వయం సహాయక బృందాలను గుర్తించి వారు విద్యార్థుల కొలతలు తీసుకొని ప్రభుత్వం నిర్దేశించిన ఆకృతుల్లో యూనిఫాం తయారు చేసి జూన్ మొదటి వారం లోగా పాఠశాలలకు అందించాలని తెలిపారు. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో నిర్దేశించిన ప్రకారం యూనిఫాం ఆకృతులను ఉండాలని తెలిపారు. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి చదువుతున్న బాలికలకు ఫ్రాక్‌తో కూడిన డ్రెస్, నాలుగు, ఐదవ తరగతుల బాలికలకు స్కర్ట్, ఆరవ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు పంజాబీ డ్రెస్ ఆకర్షణీయంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఒకటి నుంచి ఏడో తరగతి చదువుతున్న బాలురకు షర్ట్, నిక్కర్, ఎనిమిది నుచి 12వ తరగతి బాలురకు షర్ట్, ప్యాంటుతో పాటు బూడిద రంగు చెక్స్ కలిగిన క్లాత్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం ద్వారా యూనిఫాం క్లాత్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు. ఒక్కో జతకు కుట్టు కూలిగా రూ.50 చొప్పున రెండు జతలకు రూ.100 చెల్లించడానికి నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి మండలమునకు రెండు చొప్పున శాశ్వత కుట్టు మిషన్ కేంద్రాలను నెలకొల్పి 10 కుట్టు మిషన్లను పాటు చేసి నిరంతరం వాటిని నడిపించాలని మరియు ప్రతి పాఠశాలకు కుట్టు మిషన్ కేంద్రాలను సంధానం చేసి ఏకరూప చూస్తున్న కుట్టించి సరైన సమయంలో పాఠశాలకు అందించాలని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంపీడీవోలు మరియు ఏపీఎంలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.