ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి
ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : వేసవికాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ ఈ ఈ , డి ఈ లు, పబ్లిక్ హెల్త్ డి ఈ లు,ఎంపీడీవోలు, ఎంపీలు,మరియు స్పెషల్ ఆఫీసర్లతో త్రాగునీరు మరియు పనుల పురోగతిపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూనీటి ఎద్దటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి ప్రతి ఇంటికి నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవికాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని రాబోయే మూడు నెలల్లో గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు అందించాలన్నారు. గ్రామంలో గల నీటి వసతులు అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలు హ్యాండ్ పంపులు, బోర్ వెల్స్,మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. బోర్లు, హ్యాండ్, పంపులు మోటార్లు, పైపుల లీకేజీల కు అవసరమైన మరమ్మత్తులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులు ను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని అన్ని నీటి సరఫరా ప్రాంతాలను ప్రతిరోజు విధిగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అవసరం ఉన్న చోట బోర్ వెల్స్ అద్దె ప్రతిపాదికన ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ నీరు బల్క్ సప్లై సరిపోనియెడల సప్లై పెంచాలని మిషన్ భగీరథ అధికారులను ఆమె ఆదేశించారు. ఎస్ డి ఎఫ్ లో ప్రతిపాదించిన పనులను పురోగతిలో ఉన్నవి పూర్తి అయినవి,పూర్తి కావలసినవి, పట్టిక ద్వారా వివరాలను నమోదు చేసి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా అన్ని మండలాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని ఎటువంటి పొరపాట్లు లేకుండా ముందుగానే త్రాగునీటి సరఫరా పై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులకు ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ విద్యా చందన, మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.