తెలంగాణభూపాలపల్లి

భూపాలపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా  తీర్చిదిద్దాలి 

భూపాలపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా  తీర్చిదిద్దాలి 

-మంచినీటి కొరత రాకుండా ఏర్పాట్లు చేపట్టండి

-భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా

భూపాలపల్లి , శోధన న్యూస్: భూపాలపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని భూపాలపల్లి  జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ లో మంచినీటి సరఫరా, ఇంటి పన్నులు వసూళ్లు, ఇంటింటి నుంచి వ్యర్ధాలు సేకరణ తదితర అంశాలపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచినీటి సరఫరాపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరణకు తక్షణమే మున్సిపల్ కార్యాలయంలో ఫోన్ నంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీ లోని మంచి నీటి వాల్స్ రిపోర్టు, బోర్ వెల్స్ మ్యాపింగ్, ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా అంశాలపై నివేదిక అందజేయాలని అన్నారు. ఎక్కడైనా మంచినీటి సమస్య వస్తే ప్రత్యాన్మయంగా ప్రైవేట్ బోర్వెల్స్ ద్వారా నీటి సరఫరా చేయు విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ప్రతి రోజు వార్డుల్లో పర్యటిస్తూ ఐదు మంది ద్వారా మంచినీటి సరఫరా పై ఫీడ్ బ్యాక్ అందజేయాలని ఆయన సూచించారు. డ్రైన్లులో పేరుకుపోయిన వ్యర్దాలు తొలగించి పరిశుభ్రం చేయాలని, వ్యర్దాలు పేరుకుపోవడం వల్ల మురుగునీటి నిల్వ ఉంటుందని, తద్వారా దోమలు వ్యాప్తి చెందుతాయని తెలిపారు. డ్రైనేజీల ఆక్రమణను అరికట్టాలని, డ్రైనేజీలపై నిర్మాణాలను తొలగించేందుకు సంబంధిత యజమాలకు నోటీసు జారీ చేయాలని పేర్కొన్నారు. అయినప్పటికీ తొలగించకపోతే మున్సిపాలిటీ ద్వారా తొలగించి అందుకు అయిన వ్యయాన్ని వసూలు చేయాలని అన్నారు. మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు వార్డుల వారిగా చేపట్టిన నూతన నిర్మాణాలు, వెంచర్లపై నివేదికలు అందచేయాలని తెలిపారు. అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆయన మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి నుండి వ్యర్దాలు సేకరణ జరగాలని ఆయన పేర్కొన్నారు. నిర్మాణం పూర్తయిన డిఆర్సిసి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. మున్సిపాలిటీలో వినియోగిస్తున్న స్వచ్ఛ వాహనాలకు ఆయిల్ వినియోగం, తిరిగిన కిలోమీటర్లపై నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. క్రమం తప్పక ప్రతి ఇంటి నుంచి వ్యర్దాల సేకరణ జరగాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో చేపట్టిన పనులు మంజూరు చేసిన గ్రాంటు నిధులు, పెండింగ్ పనులు, పెండింగ్ నిధులు, చెల్లించిన నిధులపై నివేదిక అందజేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. మున్సిపాలిటీలో 71 శాతం మాత్రమే ఇంటి పన్నులు వసూలు చేశారని మిగిలిన 29 శాతం పన్నులు వసూళ్లకు చర్యలు చేపట్టాలని తెలిపారు. పన్నులు చెల్లించని డిఫాల్ట్లకు నోటీసులు జారీలు చేయాలని పేర్కొన్నారు. గతంలో పెండింగ్ ఉన్న పన్నులతో సహా వసూళ్లు చేయాలని అన్నారు. పన్నులు వసూళ్లు తక్కువ చేసిన సిబ్బందికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆయన మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. పన్నులు వసూళ్ళలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *