రేపటి ప్రజావాణి రద్దు
రేపటి ప్రజావాణి రద్దు
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : రేపటి సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో చేపట్టనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని, ఆయా పనుల్లో రెవిన్యూ అధికారులు నిమగ్నమై విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.