తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పసి బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక ఆయుధం రెండు పోలియో చుక్కలే

పసి బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక ఆయుధం రెండు పోలియో చుక్కలే

-పోలియో రహిత సమ సమాజస్థాపనకు పోలియో చుక్కలు  

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్  ప్రియాంక అల

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో పాల్వంచ మండలం శేఖరం బంజర పీహెచ్సీలో పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రియాంక అల పోలియో చుక్కలు వేసి పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక ఆయుధం ఈ రెండు పోలియో చుక్కలేనని , పోలియో రహిత సమ సమాజస్థాపనకు ప్రతి తల్లిదండ్రులు 0 నుండి 5 సం” వయసున్న చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ తెలిపారు. పోలియో చుక్కలు వేసేందుకు జిల్లాలో 97,572 మంది చిన్నారులను గుర్తించినట్లు వివరించారు. 925 కేంద్రాలతో పాటు అదనంగా 38 మొబైల్ టీములు, 33 ట్రాన్సిట్ పాయింట్లు ద్వారా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది 427 మంది, అంగన్వాడీ సిబ్బంది 1933, ఆశా కార్యకర్తలు 1440, ఇతరులు 191 మొత్తం 3991 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వివరించారు. గోదావరి పరివాహాక ప్రాంతాలైన ఇసుకదిబ్బలో పోలియో కార్యక్రమం నిర్వహణకు బోటు ఏర్పాటు చేశామని, అదేవిధంగా కొండవాయిలో వ్యాక్సిన్ వేసేందుకు మోటారు బైక్ టీము ద్వారా కార్యక్రమం నిర్వహస్తున్నట్లు తెలిపారు.  రానున్న మూడు రోజుల పాటు ఆశాలు, ఏఎన్ఎం లతో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు పరిశీలన చేపించి చుక్కలు వేయు విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  పోలియో చుక్కలు కార్యక్రమం నూరు శాతం పూర్తి చెయ్యాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు .ఈ కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్. శిరీష, డాక్టర్ బాలాజీ నాయక్ పిఓ సి.హెచ్.ఐ, డాక్టర్ కృష్ణ కుమారి ,నాగభూషణం సి.హెచ్.ఓ వైద్య సిబ్బంది ,పాల్వంచ డిప్యూటీ తహసిల్దార్, పట్టణ ఆరోగ్య కేంద్ర ఏ.ఎన్.ఎం లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *