తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన

సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశానుసారం  జిల్లా వ్యాప్తంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అన్ని అంగన్వాడి సెంటర్ల పరిధిలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  జిల్లా సంక్షేమ అధికారిని వేల్పుల విజేత సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి మన శరీరంలోని హిమోగ్లోబిన్ పై ప్రభావితాన్ని చూపిస్తుందని,  తద్వారా హిమోగ్లోబిన్ తగ్గిపోయి రక్తహీనత వచ్చి మనిషి నీరసంగా, వ్యాధి నిరోధకత లేకుండా ,అనేక జబ్బుల బారిన పడతారన్నారు. అలాగే  గుండె నొప్పి, పక్షవాతం, పుపూస రక్త పోటు, అందత్వం, పిత్తాశయ రాళ్లు, గర్భధారణ సమస్యలు, అవయవ నష్టం తదితర వ్యాధులు రావచ్చని తెలిపారు.  అందరూ సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు చేయించుకోవాలని, ఇందుకోసం వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో అన్ని ప్రాజెక్టుల సిడిపిఓ లు , సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు హెల్త్ విజిటర్స్ ఏఎన్ఎంలు, ఆశాలు విరివిగా పాల్గొని సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని అరికట్టాలని ముమ్మరంగా ప్రచారం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *