జాతీయస్థాయి హ్యాండ్ బాల్ రిఫరీగా వరికుటి మోహన్
జాతీయస్థాయి హ్యాండ్ బాల్ రిఫరీగా వరికుటి మోహన్
ఎరుపాలెం, శోధన న్యూస్ : 23 నుంచి 27వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న 45వ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ రెఫ్రిగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మామునూరు గ్రామ నికి చెందిన వరికుటి మోహన్ జాతీయస్థాయిలో న్యాయ నిర్ణీతగా వ్యవహరించున్నాడు . ఇట్టి విషయాన్ని హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ తెలంగాణ స్టేట్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్యామల పవన్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రిఫరీ బోర్డ్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మంగళవారం తెలిపారు. గత 20 సంవత్సరాలుగా పలుమార్లు జాతీయ స్థాయిలో రిఫరీగా మరియు జాతీయస్థాయి పోలీస్ క్రీడలలో న్యాయ నిర్ణయితగా వ్యవహరించి ఎన్నో ఉత్తమ అవార్డులు పొందినటువంటి వరికుటి మోహన్ ని ఖమ్మం జిల్లా సీనియర్ క్రీడాకారులు మరియు అసోసియేషన్ సంఘాలు , పే బ్యాక్ సొసైటీ సభ్యులు జంగా లక్ష్మణరావు , కనకయ్య , జైపాల్ , శ్రీనివాసరావు , జర్నలిస్టు వేణుగోపాలరావు గ్రామ పెద్దలు మామునూరు గ్రామస్తులు అభినందించారు.