వాసవి క్లబ్ సామాజిక సేవలు ప్రశంసనీయం
వాసవి క్లబ్ సామాజిక సేవలు ప్రశంసనీయం
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో వాసవి క్లబ్, వాసవీ వనితా వైభవం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమని డాన్ టూ డస్క్ ఇంచార్జ్ శ్రీనివాస్ గుప్తా అన్నారు. శనివారం మణుగూరులోని గుట్ట మల్లారం గాయత్రీ దేవి ఆలయ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిదులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రూ. 50వేల విలువైన సామాజిక కార్యక్రమాలను ప్రారంభించారు. బుగ్గ గ్రామ పంచాయతీకి, రేగులగండి గ్రామ పంచాయతీకి 15వేల విలువ చేసే రెండు వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ లు, నిరుపేదకు వ్యాపారం చేసుకుని ఆర్థిక పురోగతి సాధించేందుకు తోపుడు బండి తో పాటు, చిన్నారులకు పుస్తకాలు, కానిస్టేబుల్ కి రక్షణ కవచాలు, 10 మంది అంధులకు చేతి కర్రలు అందజేశారు. అనంతరం నేత్ర అవయవ దానం కార్యక్రమం ప్రోత్సహించడం వంటి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా డాన్ టూ డస్క్ ఇంచార్జ్ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ మణుగూరు వాసవీ క్లబ్, వాసవీ వనితా వైభవం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలను ప్రశంసించారు. సేవలు మరింత విస్తృతం చేసి నిరుపేదలకు అందే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మణుగూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాన్ టూ డస్క్ ఇంచార్జ్ శ్రీనివాస్ గుప్తాను ఘనంగా సన్మానుంచి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్, వనితా వైభవం మణుగూరు అధ్యక్షులు కేసా రాజేంద్ర ప్రసాద్, బొగ్గవరపు అంజలి, శ్యామ్, చలపాటి నాగరాజు, పాల్వాయి వసుంధర, జోన్ చైర్మన్ శేషు బాబు, రీజినల్ ఛైర్మన్ విశ్వనాధ గుప్తా, దింటకుర్తి బ్రహ్మయ్య, దోసపాటి లక్ష్మి, చిత్తలూరి రమేష్, ఉమ, సముద్రాల కృష్ణ మూర్తి తదితరులు ఉన్నారు.