వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం
వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం
మణుగూరు, శోధన న్యూస్ : వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మణుగూరు వాసవీ క్లబ్, వాసవీ వనితా వైభవం ఆధ్వర్యంలో గుట్ట మల్లారంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గోదావరి నది ఒడ్డున బ్రహ్మ కుండ పవిత్ర స్థలంలో వాసవీ కన్యకాపరమేశ్వరి అగ్ని గుండంలో ప్రవేశించి ఆమె భౌతిక నివాసాన్ని విడిచిందన్నారు. భూమిని విడిచి వెళ్లే ముందు తాను ఆది పరాశక్తి అవతారమని ధర్మాన్ని, మహిళల గౌరవాన్ని కాపాడేందుకు వాసవీ మాత అమ్మవారి అవతారంలో వచ్చానని వెల్లడించింది అన్నారు. అనంతరం ఆలయ పూజారి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ దోసపాటి వెంకటేశ్వర్లు, ఇంటర్ నేషనల్ ప్రోగ్రాం కో – ఆర్డినేటర్ బండారు నర్శింహారావు, వాసవీ క్లబ్, వనితా వైభవం మణుగూరు ప్రతినిధులు ప్రెసిడెంట్ కేసా రాజేంద్ర ప్రసాద్, శ్యామ్, చలపాటి నాగరాజు, బోగ్గవరపు అంజలీ, తమ్మిషెట్టి వసుధ, పాల్వాయి వసుంధర, జోన్ చైర్మన్ శేషు బాబు, చిత్తలూరి రమేష్ బాబు, కత్తి రాము, చిత్తలూరి ఉమ, నాగరత్నమణి, వడియాల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.