మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు
మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు
మణుగూరు, శోధన న్యూస్ : ఖమ్మం – వరంగల్-నల్లగొండ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శనివారం మణుగూరు మండల మున్నూరు కాపు సంఘ కార్యాలయంలో ఆ సంఘ నాయకులు స్వీట్లు పంచుకొని బాణాసంచా కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు వలసాల వెంకట రామారావు, కృష్ణమోహన్, గాండ్ల సురేష్ లు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న చట్టసభల్లో అడుగుపెట్టడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తన గలం కలం ద్వారా గత ప్రభుత్వంలోని ఎన్నో తప్పులను బయటపెట్టి ప్రజలను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో ఆవుల కనకయ్య, దాచేపల్లి శ్రీనివాస్, ఆవుల సర్వేశ్వరరావు, గాజుల రమేష్, మరి సారంగపాణి, తూపుడి శ్రీనివాస్, జక్కుల రాజబాబు, ఏనుగుల శ్రీనివాస్, మాదాసు సాయిబాబా, బత్తిని రామ్ చందర్, బేతంచర్ల వెంకటేశ్వర్లు, పోట్ల ముత్తయ్య, తాళ్లూరి వెంకటేశ్వరరావు,యూత్ నాయకులు కాట్రగడ్డ సురేందర్ పటేల్, పోట్ల శేఖర్ పాల్గొన్నారు.