తెలంగాణభద్రాచలంభద్రాద్రి కొత్తగూడెం

భద్రాచలంలో  దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన.

భద్రాచలంలో  దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన.

భద్రాచలం,శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ అయ్యర్, కమిషనర్ హనుమంతరావు భద్రాచలం పర్యటనకు విచ్చేశారు. భద్రాచలం పర్యటనకు వచ్చిన దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ , కమిషనర్ కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రతిక్ జైన్, దేవస్థానం ఈవో రమాదేవి భద్రాచలంలోని బ్రిడ్జి పాయింట్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో రమాదేవి,అర్చక స్వాములు సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చిన వీరికి ఘన స్వాగతం పలికారు. ముందుగా బలపీఠం వద్ద మరియు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ తాయారమ్మ వారిని శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అనంతరం అర్చక స్వాములు స్వామివారి విశిష్టతను తెలియజేసి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. అంతకుముందు బ్రిడ్జి పాయింట్ పక్కన భక్తుల సౌకర్యార్థం నిర్మాణం చేపట్టే టూరిజంకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించి భక్తులకు సరిపడేలా వసతి సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించే విధంగా నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంను సందర్శించారు. స్వామివారి కళ్యాణం తిలకించే విఐపి లకు భక్తులకు కలగజేసే ఏర్పాట్ల గురించి దేవస్థానం ఈవో రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవస్థానంలోని లడ్డూల తయారీ కేంద్రం, దేవస్థానం ప్రాంగణంలోని పరిసరాలను పరిశీలించి భక్తులకు అనుకూలంగా దర్శనం చేసుకునేలా రోప్ మరియు మ్యాటును ఏర్పాటు చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *