తెలంగాణసంగారెడ్డి

ముగిసిన వాయిస్ ఫర్ గర్ల్స్ కార్యక్రమం 

విజయవంతంగా ముగిసిన వాయిస్ ఫర్ గర్ల్స్ కార్యక్రమం 

సంగారెడ్డి ,శోధన న్యూస్: సంగారెడ్డి జిల్లా కస్తూర్బా పాఠశాలలో యుక్తవయసు బాలికల కోసం వాయిస్ ఫర్ గర్ల్స్ శిబిరం డి డబ్ల్యూ ఓ లలిత కుమారి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాలమేరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని 10 కేజీబీవీ కస్తూర్బా పాఠశాలలో బాలికలకు వాయిస్ ఫర్ గర్ల్స్ కార్యక్రమాన్ని ఈనెల 9 నుంచి 28 వరకు నిర్వహించడం జరిగిందని డి డబ్ల్యూ లలిత కుమారి తెలిపారు .ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కి చెందిన ఎన్జీవో వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రస్తుతం 10 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 10 రోజులపాటు వాయిస్ ఫర్ గర్ల్స్ క్యాంప్ ని , మొదటి దశ పరిచయన్ని నిర్వహించడం జరిగింది. శిబిరంలో బాలికలు యుక్త వయసు, ఋతుక్రమ ఆరోగ్యం, ప్రాథమిక హక్కులు మరియు హింస గురించి తెలపడంజరిగిందన్నారు . సంస్కృతి మరియు సమాజం నిర్దేశించినట్లుగా బలం అందం మరియు లింగం యొక్క ప్రమాణాలను ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వారిని ప్రోత్సహిస్తోంది . వారు సవాళ్ళను అధిగమించడానికి మరియు వివాదాలను పరిష్కరించడానికి సులభమైన మార్గాల గురించి ఆలోచిస్తారు.10 రోజుల కార్యకలాప ఆధారిత శిబిరం వినోద భరితమైన శక్తినిచ్చేవి మరియు కార్యకలాపాలతో నిండిపోయింది విద్యార్థులు తమ గురించి వారి శరీరం గురించి, తమ కోసం ఎదురుచూస్తున్న భవిష్యత్తు గురించి మరింత నమ్మకంగా శిబిరంలో నేర్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *