తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ప్రజలకు ఇచ్చిన హమీలన్నింటిని నెరవేరుస్తాం -ఇల్లందు ఎమ్మేల్యే కోరం కనకయ్య

ప్రజలకు ఇచ్చిన హమీలన్నింటిని నెరవేరుస్తాం 

-ఇల్లందు ఎమ్మేల్యే కోరం కనకయ్య

-రూ6.75 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

ఇల్లందు, శోధన న్యూస్ :  గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హమీలన్నింటిని నెరవేరుస్తామని,  ఆ  దిశగా కాంగ్రెస్  ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మేల్యే కోరం కనకయ్య అన్నారు.ఆదివారం జే కే,గోవింద్ సెంటర్ లో 6.75 కోట్లు డి ఎం ఎఫ్ టి నిధులతో చేయనున్న అభివృద్ధి పనులకి శంఖుస్థాపనచేశారు.ఈసందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే చేసిన వాగ్దానంలో రెండు వాగ్దానాలు అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం సంచలనం సృష్టించింది అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ప్రయాణం చేయాలంటే మహిళలు భయపడే వారిని ఆర్థికంగా లేని మహిళలు వారి కోరికలను చంపుకొని ఇంటి వద్ద ఉండే వారిని ఆ పరిస్థితి నుండి నేడు మహిళలు తమ అవసరాలను తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయాణం చేయడం శుభ సూచికమన్నారు. మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తుంటే ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీకి గుండెలు గుబెలు అంటున్నాయని , ఆటో వాళ్లను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరో రెండు పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుందని ఇందులో భాగంగా ఉచిత 200 యూనిట్ల పథకం, 500 కే గ్యాస్ సిలిండర్ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ పట్ల అభిమానంతో ఆదరించి గెలిపించిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇల్లందు మున్సిపాలిటీ మరింత అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *