ప్రతి ఎకరాకు సాగునీరు
ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
-చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్,శోధన న్యూస్: ప్రతి ఎకరాకు సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడుదామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గల గాయత్రి పంప్ హౌస్ నుండి బాహుబలి పంపు ద్వారా గ్రావిటి కెనాల్కు నీటిని విడుదల చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి రైతు భయపడవలసిన పనిలేదని ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎమ్మెల్యే అన్నారు.మాది రైతు ప్రభుత్వమని రైతు బాగుంటే రాజ్యం బాగుంటదని దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకుంటామని అన్నారు.