అనాధ పాఠశాలలను ఆదుకుంటాం
అనాధ పాఠశాలలను ఆదుకుంటాం
-ఆదరణ పాఠశాల వార్షికోత్సవంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, శోధన న్యూస్ : అన్ని ధానాల్లోకెల్లా విద్యాధానం గొప్పదని..పది మందికి పంచుకుంటే జ్ఞానం పెరుగుతుందని తెలంగాణ పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు . అన్ని ధానాలు కరిగిపోయినా..విద్యా దానం శాశ్వతంగా నిలిచి పోతుందున్నారు. విద్యావంతుడైన మనిషి సమాజహితం కోసం పని చేస్తే పదితరాలకు గుర్తుండి పోతారని తెలిపారు. విద్యావంతులతో తెలంగాణ బాసిల్లాలని ఆకాంక్షించారు. రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగిన ఆదరణ అనాధశ్రమ పాఠశాల 20వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా సీతక్క హజరయ్యారు. విద్యా ఆవశ్యక్తను తెలియజేశారు. మారు మూల గ్రామం నుంచి వచ్చి వేలాది మంది అనాధ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పిస్తూ విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఆదరణ పాఠశాల నిర్వాహులు మాధవరావును అభినందించారు. ఉచితంగా విద్యా, వసతి అందిస్తున్న ఆదరణ వంటి పాఠశాలలకు ప్రభుత్వ సహకారం ఎప్పూడు ఉంటుందన్నారు. విద్యార్ధులకు పుస్తకాలు, బ్యాగులను మంత్రి సీతక్క పంపిణి చేశారు. అనాధ పిల్లల చదువు కోసం సహయ సహకారాలు అందిస్తున్న ప్రముఖులను ఈ సందర్భంగా మంత్రి సీతక్క సన్మానించారు.