ఓసి ప్రభావిత ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటాము-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా
ఓసి ప్రభావిత ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటాము
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా
ఇల్లందు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కోయాగుడెం ఓసి ప్రభావిత ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా హామీఇచ్చారు.ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని కోయాల్గుడెం లో గురువారం.సింగరేణి సంస్థ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించింది ఈకార్యక్రమంలో కలెక్టర్ ప్రియాంక అలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల మద్దతు లేకుండా పరిశ్రమలు స్థాపించడం కష్ట సాధ్యమైన పని అన్నారు.ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభావిత ప్రజలకు అందాల్సిన ప్రతి ప్యాకేజీ సంపూర్ణ స్థాయిలో అమలు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. ఆతర్వాత కూడా ప్రజల మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత సంస్త దే నని పేర్కొన్నారు.ప్రజబిప్రాయ సేకరణకు హాజరైన పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.కే ఓ సి అనార్డాలతో అలమతిస్తున్నమని వాపోయారు.ఓపెన్ కాస్ట్ వల్ల ఒరిగేది ఏమీలేదని,అన్ని నష్టాలే ఉన్నాయని అన్నారు. అధికారులనిర్లక్ష్యం కారణంగా తమకు కష్టాలు తప్పడం లేదని అవేదన వ్యక్తం చేశారు.పర్యావరణ కాలుష్యము నివారణలో సంస్థ చేపడుతున్న చర్యలు శూన్యమని అన్నారు. నిత్యం దుమ్ముదులి కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు ఇప్పటివరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని, కె ఓ సి ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సంస్థ నుండి అందాల్సిన అభివృద్ధి జరగడంలేదని ఉద్యోగ కల్పనలో తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే ప్రజాభిప్రాయ సేకరణకు అంగీకరిస్తామని ముందుకేయడంతో జిల్లా కలెక్టర్ వారి డిమాండ్లను పరిష్కరిస్తాననిహామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి కొత్తగూడెం ఈ ఈ బి రవీందర్,ఏరియా జరల్ మేనేజర్ జాన్ ఆనంద్,పర్యావరణ మేనేజర్ గణపతి,ఎస్ ఓ టూ జి ఎం మల్లారపు మల్లయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ప్రహ్లాద్ వెంకటేశ్వర్లు దాని మేనేజర్ సౌరబ్ సుమన్ ఏరియా గనులు,విభాగాలు ఉన్నతాధికారులు,ట్రేడ్ యూనియన్ నాయకులు, ఉద్యోగులు,ప్రజలు పాల్గొన్నారు.