తెలంగాణహైదరాబాద్

వనరులను సద్వినియోగం అయ్యేలా కృషి చేస్తాం

వనరులను సద్వినియోగం అయ్యేలా కృషి చేస్తాం
-ధనుకా గ్రూప్ చైర్మన్ అగర్వాల్

హైదరాబాద్, శోధన న్యూస్: వ్యవసాయ రంగంలో పరిశోధన,వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి వనరులను సద్వినియోగం అయ్యేలా కృషి చేస్తామని ధనుకా గ్రూప్ చైర్మన్ అగర్వాల్ తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) సంస్థతో సాంకేతిక సహకార అంశమై ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ధనుకా గ్రూప్ చైర్మన్ అగర్వాల్ వెల్లడించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐసీఏఆర్ వ్యవసాయ విస్తరణ విభాగ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యుఎస్ గౌతం,తాను ఒప్పంద పత్రంపై సంతకాలు చేసినట్లు తెలిపారు.ఐసీఏఆర్ పరిధిలోని జాతీయ పరిశోధనా సంస్థలు, ప్రాంతీయ కేంద్రాలు, కేవీకే, అగ్రికల్చరల్ యూనివర్సిటీల ప్రాజెక్ట్ అమలుకు ఒప్పందంలో భాగంగా సాంకేతిక సహకారాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో మార్పులపై ప్రత్యేక ప్రదర్శనల నిర్వహణతో పాటు రైతులకు సాంకేతిక నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *