అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు సమన్వయంతో పని చేయాలి
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు సమన్వయం తో పని చేయాలి
- జర్నలిస్టులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తాం..
- ప్రజలకు, పోలీసులకు మధ్య వారధి మీడియా
- ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
మహబూబాబాద్, శోధన న్యూస్ : అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు మీడియా, పోలీస్ శాఖ సమన్వయం తో పని చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించార. ఈ సమావేశంలో జిల్లాలోని పరిస్థితులపై, శాంతిభద్రతలకు, చట్టానికి విఘాతం కలిగించే అంశాలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రదానంగా చర్చించారు. మీడియా సహాయాసహకారాలతో పలు సామాజిక రుగ్మతలపై ప్రజలలో అవగాహన కల్పించి, సమాజంలో ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచి మంచిమార్పు తీసుకొని రావాలనే ఆలోచనతో ఉన్నామని ఎస్పీ రాంనాద్ కేకన్ అన్నారు. ప్రజలకు పోలీసులకు మధ్య వారధి గా మీడియా వ్యవస్థ పని చేయాలని కోరారు. త్వరలోనే మీడియా, పోలీస్ జట్ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తామని ప్రకటించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకోసం, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడి కోసం మీనుండి నిరంతరంసమాచారాన్ని, సలహాలను ఆహ్వానిస్తున్నామని, పరిదులకు లోబడి జిల్లాలో మీడియా ప్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని ఎస్పీ తెలిపారు. మీడియా ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించి, స్నేహపూర్వ వాతావరణంలో సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రాంనాద్ కేకన్ కు జర్నలిస్ట్ లు ధన్యవాదాలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో, సమాజహిత కార్యక్రమాల నిర్వాహణలో తమ సంపూర్ణ సహకారం ఉంటుందని సమావేశంలో పాల్గొన్న జర్నలిస్ట్ లు తెలిపారు.