తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

 ఎన్నికలు సజావుగా జరిగేలా  సమన్వయంతో పనిచేయాలి 

 పార్లమెంట్  ఎన్నికలు సజావుగా జరిగేలా  సమన్వయంతో పనిచేయాలి 

– తెలంగాణ డీజిపి రవి గుప్తా 

-తెలంగాణ- చత్తీస్గడ్ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ డిజిపి పర్యటన

-మూడు జిల్లాల  పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం  

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ :  

 పార్లమెంట్  ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీస్ అడికారులంతా   సమన్వయంతో పనిచేయాలని  తెలంగాణ రాష్ట్ర డిజిపి రవిగుప్తా సూచించారు.  హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా  తెలంగాణ రాష్ట్ర డిజిపి రవిగుప్తా  చర్ల మండలం చెన్నాపురం,పూసుగుప్ప, ఉంజుపల్లిలో గల పోలీసు భద్రతా బలగాల క్యాంపులను సందర్శించారు. డీజిపి తో పాటు అడిషనల్ డీజీపీ ఇంటిలిజెన్స్ శివధర్ రెడ్డి ,గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ ఐపిఎస్, సిఆర్ పీఎఫ్  సౌత్ జోన్ అడిషనల్ డీజిపి రవిదీప్ సింగ్ సాహి,  సౌత్ సెక్టార్ హైదరాబాద్ జోన్ ఐజిపి చారుసిన్హా ,ఎస్ఐబి ఐజీపి సుమతి లు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. క్యాంపుల సందర్శనలో భాగంగా అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి డీజిపి పలు సూచనలు చేశారు. నిషేధిత సిపిఐ మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుని, అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టుల వలన రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా సారపాక ఐటీసి గెస్ట్ హౌస్ నకు చేరుకొని అక్కడ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూడు జిల్లాల ఎస్పీలతో ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.డిజిపి గారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.చెక్ పోస్ట్ల వద్ద పనిచేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అక్రమంగా నగదు,మద్యం రవాణాను అడ్డుకోవాలని సూచించారు.గత ఎన్నికల్లో మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసుకొని అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అనంతరం డిజిపి తో పాటు అధికారులందరూ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *