ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
మణుగూరు, శోధన న్యూస్ : మణుగూరు ఫోటో& వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 185 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూల మార్కెట్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ మోహన్ మాట్లాడుతూ జీవితం లో ప్రతి క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా చూపించగలిగేది ఒక్క ఫోటో మాత్రమేనని, గడిచిన కాలాన్ని కళ్ళ ఎదుట నిలిపేది ఫోటో అని అన్నారు.. ప్రతి ఫోటో గ్రాఫర్ తమ వృత్తి లో పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని మీ వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలని , అందరం కలిసి కట్టుగా సంఘం నియమాలను పాటిస్తూ సంఘ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. అనంతరం అమ్మ, నాన్న వృధాశ్రమం లోని వృద్దులకు బన్ను, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గాజుల పూర్ణ చందర్ రావు, అధ్యక్షులు కృష్ణ మోహన్, కార్యదర్శి పుసులూరి శ్రీనివాస్, జిల్లా బాధ్యులు జేమ్స్ మరియు అసోసియేషన్ శాశ్వత సభ్యులు పాల్గొన్నారు.