యువత ఆర్దిక స్వయం సమృద్దిని సాదించాలి
యువత ఆర్దిక స్వయం సమృద్దిని సాధించాలి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : అంది వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత ఆర్దిక స్వయం సమృద్దిని సాధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి బాబూరావు అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి, ఆత్మ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ భద్రాది కొత్తగుడెం వారి ఆధ్వర్యంలో బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు రైతు వేదికలో గ్రామీణ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి బాబూరావు ముఖ్య అతిధిగా హాజరై తేనె టీగల పెంపకం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతంలో వృత్తి నైపుణ్య శిక్షణతో యువత స్వయం ఉపాది పొందవచ్చని . ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని అన్నారు. ప్రస్తుత వాతావరణ, సామాజిక, పరిస్థితుల నేపద్యంలో యువత వ్యవసాయంతో పాటు, ఉద్యాన పంటలు, కూరగాయలు, చేపల పెంపకం, తెనెటీగల పెంపకం, పట్టుపురుగుల, పుట్టగొడుగులు, కోళ్ళ పెంపకం చేపట్టాలని, ఆర్థిక పరిస్థితులు మెరుగు పడాలంటే స్వయం సమృద్ది సాదించాలని, అప్పుడే యువత అన్నిరంగాల్లో ఆదాయం పొందవచ్చ ని తెలిపారు. సాంప్రదాయ పంటలు కాకుండా కొత్తగా ఆదాయం పెరగడానికి ఇది ఉపయోగపడుతుందని సంచించారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ డాక్టర్ బి శివ, శాస్త్రవేత్త కే వి కే , ఏడిఏ జి లాల్ చంద్, ఏఓ జి లీపక్ నంద్ , రైతులు పాల్గొన్నారు.