తెలంగాణభూపాలపల్లి

యువత క్రమశిక్షణతో హోలీ జరుపుకోవాలి

యువత క్రమశిక్షణతో హోలీ జరుపుకోవాలి

-భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే

భూపాలపల్లి, శోధన న్యూస్:ప్రజలు హోలీ పడుగను ప్రశాంతంగా ప్రశాతంగా జరుపుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే తెలిపారు. హోలీ పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు పోలీసు శాఖ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయాల నడుమ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం నేరమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సురక్షితమైన సహజ రంగులను వాడి పండుగను నిర్వహించుకోవాలని, రసాయన రంగులను ఉపయోగించవద్దని పేర్కొన్నారు. యువత హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచించారు. యువత తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి సరైన పద్ధతినీ తెలియజేయాలని సూచించారు. వాహనాలు నడిపే క్రమంలో అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ వంటివి మానుకోవాలని, తెలియని వారిపై రంగులు చల్లవద్దని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *