అంగన్వాడీ కేంద్రంలో మాన్సూన్ ఆయుర్వేద వైద్య శిబిరం
అంగన్వాడీ కేంద్రంలో మాన్సూన్ ఆయుర్వేద వైద్య శిబిరం
అశ్వాపురం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో జగ్గారం-1 అంగన్వాడీ కేంద్రం లో సోమవారం రోజున ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, అశ్వాపురం ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ గుమ్మడి అరుణ రోగులను పరీక్షించి ఆయుర్వేద మందులు అందజేశారు. ఈ శిబిరానికి వచ్చిన రోగులకు వర్షాకాలం లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు జీవన శైలి, ఆయుర్వేద ఔషధాల విశిష్టత, వాతావరణ మార్పుల ద్వారా శారీరకంగా వచ్చే వ్యాధులు, వ్యాధులకు గృహ వైద్య చిట్కాలు వివరించారు. అలాగే ప్రతి గ్రామంలో నిర్వహించబడే మాన్సూన్ ఆయుర్వేద క్యాంప్ లను ప్రజలు వినియోగించుకోవాలని
సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ పారామెడికల్ స్టాఫ్ జి రాధిక, ఆశ కార్యకర్తలు సావిత్రి, జ్యోతి, గ్రామపెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.