ఖమ్మంతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు పాటుపడాలి 

అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు పాటుపడాలి 

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత  వెంకట రెడ్డి
జూలూరుపాడు, శోధన న్యూస్ :  అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకట రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ 67 వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకట రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా ఊరి దూరంగా వివక్షతకు గురైన దళితుల అభ్యన్నతికి బిఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం లో సమాన హక్కులు, అవకాశాలు కల్పించి చిరస్మరణీయుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. సమాజానికి దూరంగా,ఆర్ధిక,అసమానతలు ఎదుర్కొంటున్న అంటరాని కులాల సమానత్వం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు బిఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు.  రాజ్యాంగంలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు విద్య,ఉద్యోగ,రాజకీయ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు పొందుపరిచిన ఘనత అంబేడ్కర్ కు దక్కుతుందని వెంకట రెడ్డి అన్నారు.రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వంతో పాటు అన్ని కులాలు,మతాలు సామరస్యంగా జీవనం సాగిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల నర్సింహారావు, వెంగన్నపాలెం ఎంపిటిసి దుద్దుకురి మధుసూదన్ రావు,నర్వినేని పుల్లారావు ,పోతురాజు నాగరాజు,మోదుగు సుగుణరావు,బానోత్ హతీరామ్,కోట కుమార్, తాళ్లూరి లక్ష్మయ్య,రామిశెట్టి నాగేశ్వరావు,వేమూరి కనకయ్య,అల్లాడి లింగరావు,దేవరకొండ కిరణ్,మంద బాబు,గోలి సెల్వరాజ్, మంద సురేష్,మిర్యాల కిరణ్,మాడుగుల నాగరాజు ,అనగంటి లక్ష్మి,జ్యోతి, యోహాన్,దేవేందర్,కాకటి నాగేష్,దెబ్బేందుల సాయి వేల్పుల సన్నీ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *