అనుమతి లేని రూ.6 లక్షలు స్వాధీనం
అనుమతి లేని రూ.6 లక్షలు స్వాధీనం
మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని అదర్శ్ నగర్ ప్రాంతంలో గల వేణు రెస్టారెంట్ వద్ద అనుమతి లేకుండా తీసుకెళ్తున్న రూ.లక్షలను ఫ్లైయింగ్ స్క్యాడ్ సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముద్రగడ్డ శ్రీనువాస్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా రూ6 లక్షలను తీసుకువెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఫ్లై య్యింగ్ స్క్యాడ్ సిబ్బంది అతనిని తనిఖీ చేయగా.. నగదు లభ్యమైంది. ఆ నగదును ఫ్లై య్యింగ్ స్క్యాడ్ సిబ్బంది స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఫ్లైయ్యింగ్ స్క్వాడ్ అధికారి తెలిపారు. ఈ తనిఖీ లో ఫ్లైయింగ్ స్క్యాడ్ అధికారి నరేష్, మణుగూరు ఎస్ఐ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.