అనురాధను కలసిన ఎమ్మెల్యే మెచ్చా
అనురాధను కలసిన ఎమ్మెల్యే మెచ్చా
దమ్మపేట , శోధన న్యూస్ : దమ్మపేట మండలపరిధిలోని మందలపల్లి లో ఫీడ్ ద నీడ్ చైర్ పర్సన్ గారపాటి అనురాధ ను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు . గత ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వరరావు గెలుపుకోసం విశేషంగా కృషిచేసిన గారపాటి అనురాధతో భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది .సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గారపాటి అనురాధ ను గతంలో లాగా తనకు మద్దతు తెలిపి , తన గెలుపుకోసం కృషి చేయాల్సిందిగా మెచ్చా కోరారు . అశ్వారావుపేట బిఆరెస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపుకోసం కృషి చేస్తానని అనురాధ తెలిపారు . ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు , బిఆరెస్ మండలపార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు , వైస్ ఎంపిపి దారా మల్లిఖార్జునరావు , యార్లగడ్డ బాబు , పానుగంటి చిట్టిబాబు ,రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .