అభివృద్ధి జరగాలంటే భట్టిని గెలిపించండి
అభివృద్ధి జరగాలంటే భట్టిని గెలిపించండి
- అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని
మధిర, శోధన న్యూస్ : మధిర మరింతగా అభివృద్ధి జరగాలంటే సీఎల్పీ నేత ,మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను గెలిపించాలని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఖమ్మం పాడు గ్రామంలో మువ్వా వెంకయ్యబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకి ఆకర్షితులై బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటీలకు చెందిన 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఆమె పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్బంగా మల్లు నందినివిక్రమార్క మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ 2,500లు, రైతు భరోసా ద్వారా ఎకరానికి రైతులకు, కౌలు రైతులకు రూ 15 వేలు,వ్యవసాయ కూలీలకు రూ 12 వేలు,గృహజ్యోతి పథకంతో ప్రతి మహిళ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్,ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు లేనివారికి ఇంటి నిర్మాణం కోసం రూ 5 లక్షలు, యువ వికాసం కింద రూ 5 లక్షల విద్య భరోసా కార్డు,గ్యాస్ ధర రూ 500 రూపాయలకు అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో భట్టివిక్రమార్క హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ధారా బాలరాజు, చావలి రామరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.