అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును చూసి గెలిపించండ-ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ
అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును చూసి గెలిపించండి
-ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ
కామేపల్లి, శోధన న్యూస్ : అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును చూసి గెలిపించాలని ఇల్లందు ఎమ్మెల్యే,బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి బానోతు హరిప్రియ అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. మండల పరిధిలోని కొత్త లింగాల, గోవిందరాల, గరిడేపల్లి , బర్లగూడెం, పొన్నెకల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. మహిళలు కోలాట నృత్యాలు, మంగళహారతులతో హరిప్రియకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వందల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించామని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యే గా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత రాందాస్ సర్పంచ్ లు బొడ్డు కాంతమ్మ ,బానోతు రవి మూడు రాధా శ్రీనివాస్, లక్ష్మణ్ చౌదరి ,నాయకులు రాయల చిన్న వెంకటేశ్వర్లు, ఎడ్లపల్లి బాబు, బోడ రాంజీ నాయక్, ధరావత్ వీరన్న , కృష్ణారెడ్డి , రాందాసు ,అజ్మీర రాజు నాయక్ ,హనుమ ,భీమా నాయక్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.