అభ్యర్థుల ఖర్చులను ఖచ్చితంగా నమోదు చేయాలి-ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్ కుమార్ పాల్
అభ్యర్థుల ఖర్చులను ఖచ్చితంగా నమోదు చేయాలి
- ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్ కుమార్ పాల్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : అభ్యర్థుల ఖర్చులను కచ్చితంగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్ కుమార్ పాల్ తెలిపారు. శనివారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాల్ లో కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల వ్యయ, ఎంసీఎంసి, ఆబ్కారీ, ఆదాయపు పన్ను శాఖ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను నామినేషన్ వేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు ఖచ్చితంగా నమోదులు చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్ట్రాటిక్ సర్వేలైన్స్ బృందాలు, వీడియో సర్వేలైన్స్, వీడియో పరిశీలన బృందం , అకౌంటింగ్ బృంద సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో సమర్ధవంతంగా తమ తమ బాధ్యతలను నిర్వర్తించేలా చూడాలని అన్నారు. ఎన్నికల వ్యయ ఖర్చులు పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన టీముల విధుల నిర్వహణ పర్యవేక్షణ బావుందని జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో బృందాలు బాగా పని చేస్తున్నాయని కితాబునిచ్చారు. ఎన్నికల్లో పోటీచేసే రాజకీయపార్టీల అభ్యర్థుల ఖర్చుల వివరాలను సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ టీం, వీఎస్టి, వీవీటీలు నమోదు ప్రక్రియను చేపట్టాలన్నారు. రాజకీయపార్టీలు, అభ్యర్థుల నిర్వహించే ర్యాలీలు, బహిరంగసభలు, సమావేశాలు, రోడ్లన్నింటిని వీడియో సర్వేలైన్స్ టీం సభ్యులు రికార్డింగ్ చేసి వీడియో పరిశీలన సభ్యుల ద్వారా సదరు వీడియోలను పరిశీలించి వివరాలను అకౌంటెంట్ సభ్యులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అకౌంటింగ్ టీం సభ్యులు వివరాలను షాడో అబ్జర్వేషన్ రిజిష్టర్లో నమోదు చేయాలని, అనంతరం పూర్తి వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలన్నారు. ర్యాలీలు, సమావేశాల ద్వారా నిర్వహించిన పార్టీ, ప్రచార ఖర్చులు నిర్ణయించిన రేట్ల ప్రకారం నమోదు చేయాలని, పోటీచేసే అభ్యర్థులు తమ ప్రచార వ్యయ ఖర్చులు, వ్యయ అకౌంట్లు, రిజిష్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చులను నామినేషన్ వేసిన సందర్భంగా, ఎన్నికల అనంతరం పరిశీలన చేయనున్నారని అన్నారు. పరిశీలనకు మధ్య మూడు రోజుల వ్యవధి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అనుమతి తీసుకున్న వాహనాలకంటే ఎక్కువ ఉపయోగించిన ఖర్చులు నమోదుచేసి అనుమతి రద్దు చేయాలన్నారు. ఒకరు అనుమతి తీసుకున్న వాహనం వేరే అభ్యర్థి ఉపయోగించరాదని, ఆ అభ్యర్థి వ్యయంలో ఖర్చు నమోదుచేసి అనుమతులు రద్దు చేయాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఎన్నికల ప్రకటనలు, జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సర్టిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఎస్ ఎస్ టికి మేజిస్ట్రేట్ పవర్ ఉన్న అధికారి, పోలీస్ సిబ్బంది ఉండాలని తెలిపారు . సమాస్త్మా ఇల్లందు, కొత్తగూడెం సెన్సిటివ్ నియోజకవర్గాలైనందున అదనపు ఏ ఈ ఓలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యయ పరిశీలన నోడల్ అధికారులు వెంకటేశ్వర్లు, వేంకటేశ్వరరెడ్డి, ఎంసీఎంసి నోడల్ అధికారి, ఎంఎంసి నోడల్ అధికారి రుక్మిణి, ఆబ్కారి నోడల్ అధికారి జానయ్య, ఆదాయపు పన్ను నోడల్ అధికారి సింధు, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల సహాయ వ్యయ నోడల్ అధికారులు, ఎఫ్ఎస్టీ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.