అమరుల ఆశయ బాటలో సాగుదాం
అమరుల ఆశయ బాటలో సాగుదాం
ములకలపల్లి, శోధన న్యూస్ : ములకలపల్లి మండలం లో జగన్నాథపురం పంచాయతీలోని లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది.ఈ సభను ఉద్దేశించి అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం ములకలపల్లి మండల కార్యదర్శి ఎర్రగొర్ల రామారావు మాట్లాడుతూ.భారత విప్లవ ఉద్యమంలో సమసమాజ స్థాపన కోసం పోరాడి అమరులైన ఎందరో అమరవీరులు భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం కార్మిక వర్గ హక్కుల కోసం ఈ దేశ విముక్తి కోసం ఎన్నో వందల మంది ప్రాణార్పణాలు చేశారు అని అన్నారు.ఆ అమర యోధులందరినీ పేరుపేరునా తలుచుకుందాము.నివాళుర్పిద్దాం.వారి త్యాగాలను గానం చేద్దాం.వారి బాటను ఎంచుకుందాం.వారు ఆశించిన సోషలిస్టు రాజ్య ప్రజారాజ్య నిర్మాణం కోసం,ప్రజలను వర్గ పోరాటంలోనికి సామూహిక తిరుగుబాటులోనికి సమీకరిద్దాం అని పార్టీ శ్రేణులకు సూచించారు.100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ అనుభవాలను 55 ఏళ్ల విప్లవోద్యమంలో దొర్లిన అతివాద విధానాలను,తప్పుడు ఎత్తుగడలను సరి చేసుకొని భారతదేశ నిర్దిష్ట పరిస్థితులలో నిర్దిష్ట కర్తవ్యాలను రూపొందించుకుందామని పేర్కొన్నారు.అమరుల ఆశయ సాధనకై మనమందరం కృషి చేయాలని,ఆ అమరులు మనకు చూపిన బాటలోనే మనమందరం నడవాలని,ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో సోడే ముకేశ్, మడివి మహేష్, పోడియం రాజు, పోడియం లక్ష్ముడు, మడకం ఇంగ, మడివి రాజు, పోడియం ఐతు, రవ్వ రాజు, మడివి కొస, తదితరులు పాల్గొన్నారు.