అయ్యప్ప నామస్మరణతో మారు మ్రోగుతున్న పల్లెలు
అయ్యప్ప నామస్మరణతో మారు మ్రోగుతున్న పల్లెలు
ఏన్కూరు, శోధన న్యూస్: ఏనుకూరు మండలంలోని పలు పల్లెల్లో అయ్యప్ప స్వామి మాలదారులతో ప్రత్యేక సందడి నెలకొనడంతో పాటు,అయ్యప్ప స్వామి నామ స్మరణతో,శరణు ఘోషతో మారు మ్రోగుతున్నాయి. శివునికి ప్రీతి పాత్రమైన కార్తీక మాసంలో కఠినమైన నియ మ నిష్టలతో అయ్యప్ప స్వామి మాలదారులు దీక్షలు చేపట్టడం…జన్మజన్మల పు ణ్య ఫలంగా భావిస్తారు.శరీరాన్ని, మనస్సును…అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింప జేసేది…అయ్యప్ప స్వామి మండల దీక్ష.41 రోజులు పాటు అయ్యప్ప స్వామికు ఆత్మ నివేదన చేసుకుంటూ ప్రతి నిత్యం శరణు ఘోషతో పూజ చేస్తారు. కార్తీక మాసాన్ని పుష్కరించుకొని పలు గ్రామాలలో అయ్యప్ప స్వామి భక్తులు,మం డల దీక్ష కోసం మాల ధారణను ధరించారు. మాల ధారణ చేసిన స్వాములు ఆయా గ్రామాలలో ఉన్న దేవాలయాలలో ప్రత్యేక పీఠాలను ఏర్పాటు చేసుకొని ఉదయం, రాత్రి వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాలలో మాల ధరించిన అయ్యప్ప స్వాములు అంతా నిత్యం వేకువ జామునే నిద్రలేచి, కాల కృత్యాలు అ నం తరం బ్రహ్మ ముహూర్తంలో చన్నీటి స్నానం ఆచరించి,నల్లని దుస్తులు ధరిం చి…చందనం..విభూది.. కుంకం..తో అలంకరించుకొని సూర్యోదయం కాక ముందే ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. ఆ యా దేవాలయాలలో మండ ల దీక్షలో భాగంగా..ఏర్పాటు చేసు కున్న అయ్యప్ప స్వామి పీఠాల వద్ద గు రుస్వాముల నేతృత్వ ములో అయ్యప్ప స్వామి మాలధారులు ఈ పూజలలో పా ల్గొంటున్నారు. తొలుత గణ పతి పూజా, గణపతి అష్టోత్తర ముతో ప్రారంభమైన పూ జా…శ్రీవల్లి దేవ సేనా సమేత సుబ్రహ్మణ్యo స్వామి,అయ్య ప్ప స్వామి అష్టో త్తరాలతో పా టు అయ్యప్ప స్వామి శరణు ఘోషతో ముగిస్తున్నారు.ఇదే కాకుండా మాల ధరించిన అ య్యప్ప భక్తులు కార్తీక మాసా న్ని పురస్కరించుకొని తమ త మ ఇండ్లలో మినీ పడి పూజ లను ఘనంగా నిర్వహిం చుకుం టున్నారు.అరటి బొడ్డు లతో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసుకుని…విఘ్నేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యం స్వామి,అయ్య ప్ప స్వాములకు గోపురాలు ఏర్పాటు చేసి,18 మెట్ల ఏర్పా టు చేసి,తర్వాత వాటిని వివిధ రకాల పుష్పాలతో అలంక రించడంతో పాటు దీపోయో మానంగా, విద్యుత్ దీపాలను అలంకరిస్తున్నారు. ఇలా అలంకరించిన మినీ పడి పూజా మండపాల ఎదుట కూర్చొని అయ్యప్ప స్వాములు భజనలు చేస్తూ,పాటల పాడుతూ తమ భక్తి భావాన్ని చాటుకుంటు న్నారు. మాలధారులు మినీ పడి పూజ ల వద్ద పాడుతున్న అయ్యప్ప స్వామి వారి పాట లు,అయ్యప్ప భక్తులను ఒళ్ళు పులకరింప జేస్తున్నాయి. అదేవిధంగా అయ్యప్ప స్వాములు ఆయా గ్రామాలలో అయ్యప్ప స్వామి నగర్ సంకీ ర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నారు. మండలంలో ని…తూతక్క లింగన్నపేట,కేసు పల్లి, రేపల్లెవాడ, తిమ్మారావుపేట, జన్నారం,హి మాంనగర్, నాచారం,ఏనుకూరు తదితర గ్రామాలలోని ఉన్న ఆలయాల వద్ద అ య్యప్ప మాలదారులు ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసుకొని సుమారు 600 మంది పైగా అయ్యప్ప స్వాములు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు.దీం తో అయ్యప్ప స్వామి మాలదారులతో పల్లెల లో ప్రత్యేక సందడి నెలకొనడంతో పాటు అయ్యప్ప నామస్మ రణ, శరణు ఘోషతో పల్లెలన్నీ మారుమ్రోగుతున్నా యి.కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వామి మాలదారు లకు…మాల వేసుకోలేని అ య్యప్ప భక్తులు అన్నదాన కార్యక్రమాలను సైతం విరి విరిగా నిర్వ హిస్తున్నారు. అయ్యప్ప మాలదారులు రోజులో.. ఒక్కసారి మధ్యా హ్నం బిక్ష..రాత్రి అల్పాహా రం..మూడు సార్లు చన్నీటి స్నా నం..కటికి నేలపై నిద్రించాలనే కఠిన నియ మాల తోరణ మే…ఈ అయ్యప్ప స్వామి దీక్ష…ప్రతి ఒక్కరిని అయ్యప్ప స్వామి అని పిలవడం…ప్రతి ఒక్క మాలధారుడి జీవనశైలిని మార్చి వేస్తుందని,శక్తి రూపుడైన అ య్యప్ప దీక్షను ఆచరిస్తారు.