అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా-జనసేన అభ్యర్థి ఉమాదేవి
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
-జనసేన అభ్యర్థి ఉమాదేవి
ములకలపల్లి , శోధన న్యూస్ : బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ నియోజకవర్గ అభ్యర్థి ముయబోయిన ఉమాదేవి మండలంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ గాజు గ్లాసు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నియెజక వర్గంలో ఎందరో ఎమ్మెల్యేగా గెలిచిన చాలా గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యారని ఆమె అన్నారు. నియోజకవర్గంలో సరైన వసతులు లేకఆదివాసి బిడ్డలు చదువులు మధ్యలోనే ఆగిపోయాయి చిన్న వయసులోనే కూలి పనులు చేయవలసి వస్తుంది అని జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియెజక వర్గంలోఅభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా అని ఆమె అన్నారు .బీజేపీ పార్టీఅధికారంలోకి రాగానే మీము ప్రకటించిన హామీలు తప్పకుండా అమలు చేస్తామని బీసీని ముఖ్యమంత్రిని తప్పకుండా చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ చాగంటి మురళీకృష్ణ, నియోజకవర్గ ఇన్చార్జ్ డేగల రామచంద్రరావు, మండల అధ్యక్షుడు ప్రవీణ్ ,దొరికే రాంబాబు, బిజెపి మండలాధ్యక్షుడు శ్రీనివాస రావు ,తదితరులు పాల్గొన్నారు.