తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు  -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ  వినీత్ 

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు 

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ  వినీత్ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శోధన న్యూస్ : మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వివిధ ప్రదేశాలలో రోడ్లపై నీరు చేరుతున్నందున పోలిస్ శాఖా అద్వర్యంలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  ముందస్తు చర్యలు చేపదుతున్నామని,  ప్రజలంతా సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ జి  వినీత్  బుదావారం తెలిపారు.  రోడ్ల పై నీరు చేరిన  ప్రదేశాలలో ప్రజలు రోడ్లు దాటకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.   అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వాగుఒడ్డుగూడెం వద్ద వాగు రోడ్డుపై సుమారుగా 5 అడుగులపైన ప్రవహిస్తున్నదని, దొంతికుంట చెరువు వరద నీరు ఇండ్లలోకి, ఉట్లపల్లి గ్రామంలోకి భారీగా నీరు చేరిందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్తగూడెం నుండి పెనుబల్లి రోడ్ పై, దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం నుండి నాగుపల్లి వెళ్లే రోడ్డు ఆసన్నగూడెం వద్ద మల్లెపూల వాగు రోడ్డుపై,  మొద్దులగూడెం వద్ద రోడ్డుపై , పేరంటాల చెరువు వద్ద రోడ్డుపై, గణేష్ పాడు నుండి నాచారం దగ్గర రాళ్ళ బంజర గ్రామం వద్ద రోడ్డుపై వరద  నీరు ప్రవహిస్తున్నందున ఆయా మార్గాల  గుండా రాకపోకలు నిషేదించినట్లు తెలిపారు. చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల చెరువు(జివి మాల్) వద్ద రోడ్డుపై 2 అడుగులు పైన ప్రవహిస్తున్నందున బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు.  సుజాతనగర్ మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద ఉన్న వాగు పొంగి రోడ్డుపై  ప్రవహిస్తున్నందున రాకపోకలు నిషేదించినట్లు తెలిపారు. జూలూరుపాడు కాకర్ల నుండి అనంతారం వెళ్లే రోడ్డుపై, పడమట నరసాపురం నుండి బేతాళపాడు రోడ్డులో ,  చండ్రు గొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాల్యతండా నుండి పోకలగూడెం వెళ్ళు దారిలో వరద  ప్రవాహం ఉండడంతో రాకపోకలు నిషేదించినట్లు తెలిపారు. పాల్వంచ కిన్నెరసానికి భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తివేయడం వలన రాజాపురం నుండి యానంబైలు రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్ అయ్యాయన్నారు. ములకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చాపరాలపల్లి నుండి కుమ్మరిపాడు వెళ్లే దారిలో బ్రిడ్జి వద్ద రహదారిపై, ములకలపల్లి ముత్యాలంపాడు బ్రిడ్జి వద్ద రహదారిపై   నీరు ప్రవహిస్తున్నందున రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశ్వాపురం నుండి గొందిగూడెం వెళ్ళు దారిలో ఇసుక వాగు ఉదృతి వలన రాకపోకలు నిలిచిపోయాయన్నారు.  ప్రజలు గమనించి ఆయా మార్గాల్లో ప్రయాణాలు చేయవద్దని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *